దసరా ఉత్సవాల హడావుడిలో కొత్తగా ఏమీ పొస్ట్ చేయలేకపోయినందుకు కంతవ్యుణ్ణి. మరలా ఇపుడు హరిద్వార్ యాత్ర మరో 10 రోజులు. వచ్చాక కొత్త పోస్ట్ తో మీముందుండగలను. :)
Wednesday, 12 October 2011
Wednesday, 31 August 2011
‘ఆస్తులు అమ్ముకుని ఆత్మ శోధనకై ఒక యోగి ప్రస్థానం’ (ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ కి తెలుగు అనువాదం)
చాలా పెద్ద పేరున్న జూలియన్ మాంటిల్ అనే ట్రయల్ లాయర్ ఒకరోజు కోర్టు హాలులో గుండెపోటుతో విరుచుకు పడిపోవడంతో కథ మొదలవుతుంది. పని…పని…పని… మాత్రమే ప్రపంచం. పనే దేవుడు. పనినే ప్రాణంగా భావించే జూలియన్ మాంటిల్ రెండు మూడు నెలలకు హాస్పిటల్ లో బతుకుజీవుడా అని ప్రాణాలతో బయటపడతాడు. కాని, మూడు నెలల్లోనే తన ఆస్తి, ఐశ్వర్యమూ సంపదా అన్నింటినీ పూచికపుల్లతో సహా అమ్మేస్తాడు. తనకంటూ ఏ వస్తువూ వుంచుకోడు. ఆఖరికి తన పడవలాంటి కారుని కూడా అమ్మిపారేస్తాడు. ఆ తరువాత ఆశ్చర్యకరంగా ఈ ప్రపంచంనుండి అదృశ్యమై పోతాడు. ఎక్కడికి వెళ్లిపోయాడో తన ఆచూకీ ఎవ్వరికీ తెలీదు.
పదిహేడు సంవత్సరాలుగా అతడితో కలిసి పనిచేస్తున్న జాన్ మనకీ కథంతా చెపుతుంటాడు. అలాంటి జాన్ దగ్గరకు ఒకరోజు సన్నగా, ఆరోగ్యంగా, చలాకీగా మెరుస్తోన్న కళ్లతో వ్న్న ముప్పైఏళ్ల యువకుడు వచ్చి నేనే జూలియన్ మేంటిల్ నని చెప్తే కథకుడు నమ్మలేకపోతాడు. బానడు పొట్ట, ఊబ శరీరం, సగం పైబడిన వయస్సు ఎలా మాయమైపోయాయని ప్రశ్నల వర్షం కురిపించిన కథకుడికి వివరంగా రెండు వందల పేజీలలో చెప్పిన సమాధానమే ఈ నవల.
ఒత్తిడితో, విరామమెరుగకుండా, యాంత్రికంగా మారిన జీవితంపై విముఖతతో ప్రశాంతతను వెతుక్కుంటూ బయలుదేరిన జూలియన్ వాళ్లూవీళ్లూ ఇచ్చిన సమాచారం మేరకు భారతదేశం చేరి హిమాలయాల దారి పడతాడు. ఆ మంచు ప్రర్వతశ్రేణులలో మహామునులను అన్వేషిస్తూ సాగించిన మహాప్రస్థానంలో శివానా పర్వతప్రాంతంలో కొంతమంది యోగులు కనిపించి జీవితసారాన్ని బోధిస్తారు. బహుశా ఈ సరికి మీకు అర్థమైపోయుంటుంది. ప్రాచీన భారతీయ జీవన విధానాన్ని రచయిత అత్యద్భుతంగా వర్ణించి వుంటాడని, అవును. నిజమే. ఈ పుస్తకం అమ్మకాలు, దీని తర్వాత రచయిత రాసిన పుస్తకాల వివరాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ నవల ప్రచురణ తర్వాత రాబిన్ శర్మ తన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టేసి, పూర్తిగా పబ్లిక్ స్పీకింగ్ వృత్తిలో స్థిరపడిపోయాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. మన జీవనవిధానం పట్ల, మన తత్త్వం పట్ల పాశ్చాత్యులు ఎంత మక్కువ చూపిస్తున్నారో తెలుస్తుంది.
జీవితాన్ని ఏడు సూత్రాలతో ఆనందమయం చేసుకోవచ్చంటాడు రచయిత. మనసుపై అదుపు, గమ్యంపై అదుపు, కైజెన్ సాధన, క్రమశిక్షణతో బతుకు, కాలంపై అదుపు, నిస్వార్థ ప్రేమ, ప్రస్తుతాన్ని ప్రేమించు అనే ఏడు సూత్రాలు, ఒక్కో సూత్రంపై ధ్యానానికి ఒక్కో చిహ్నం, ప్రతి సూత్రమార్గంలో ప్రయాణించడానికి కొన్ని నిర్దిష్టమైన దారులు సూచిస్తాడు. చాలా ఆసక్తికరమైన సంభాషణలతో, పిట్ట కథలతో, ఉపదేశాలతో, సూక్తులతో సాగిపోయే రచన ఈ నవల. యువతరానికి ఎంతో ఉపయుక్తంగా వుంటుంది.
తెలుగులో ఈ పుస్తకం పేరు ‘ఆస్తులు త్యజించి ఆత్మ శోధనకై ఒక యోగి ప్రస్థానం’. కొన్ని ఘట్టాలు అభూత కల్పనలు అనిపించేలా ఉన్నప్పటికీ చాలా ఆసక్తకరంగా ఉంటుందీ పుస్తకం. ‘ఆనందపరుస్తూ ఉపదేశించే అద్భుతమైన కథ’ అంటూ ‘ది ఆల్కెమిస్ట్’ రచయిత పాల్ కొయెల్ హో లాంటివారి ప్రశంసలు అందుకున్న పాపులర్ పుస్తకం. 41 భాషల్లోకి అనువాదం పొందింది.
తెలుగు అనువాదం చేసిందెవరో పుస్తకంలో ఎక్కడా కనిపించకపోవటం ఓ లోటు.
Saturday, 27 August 2011
అమ్మ ఒడిలోకి పయనం (ఒక అమెరికా స్వామి ఆత్మకథ )
చికాగో నుంచి భరతమాత ఒడికి....
‘సమస్యల సుడిగుండంలో చిక్కుకుని..దారీ తెన్నూ తెలియక సతమతమయ్యే నేటి యువతకు వెలుగు రేఖను చూపి ఆ వైపు పయనింపచేసే అక్షర చుక్కాని ‘అమ్మ ఒడిలోకి పయనం’ గ్రంథం. ధనం, ఐశ్వర్యం, విలాస వస్తువులతో భోగభూమిగా ప్రసిద్ధికెక్కినా.. అమెరికాలో పుట్టినా.. వాటిని అనుభవించే యవ్వనంలో అడుగు పెట్టినా..అన్నింటినీ తృణీకరించి, ఆధ్యాతిక సాహస యాత్ర చేసిన నవయుగ పాశ్యాత్య యువ యోగి ఆత్మకథ ఇది...‘ది జర్నీ హోమ్’ పేరుతో రాధానాథ్ స్వామి ఆంగ్లంలో రచించిన గ్రంధాన్ని వారి శిష్యులు యుగళ కిశోర్‌దాస్ తెలుగులోకి అనువదించిన ‘అమ్మ ఒడిలోకి పయనం- అమెరికా స్వామి ఆత్మకథ’ పుస్తకాన్ని మార్చి ౨౮, ౨౦౧౧ న హైదరాబాద్ శిల్పకళావేదికలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆవిష్కరించారు .
రిచర్డ్ ఆధ్యాత్మిక సాహసయాత్ర
ఆ యువకుడు కాలేజీ సెలవుల్లో స్నేహితులతో కలిసి యూరోప్ వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. కొద్దిరోజుల్లోనే యూరోప్ యాత్ర, డబ్బు అయిపోయాయి. కానీ ఆధ్యాత్మిక తృష్ణ మాత్రం తీరలేదు. క్రీట్ ద్వీపంలో ఒక కొండ శిఖరం మీద ధ్యానం లో ఉన్నపుడు ఆయనకు ‘భారత దేశానికి వెళ్లు’ అనే మధుర గం భీర స్వరం వినిపించింది. అంతే అత్యంత ప్రియ మిత్రుడయిన ‘గేరి’ని కూడా వదిలి ముందుకు సాగాడు. కలరా వ్యాపించి ఉన్న ‘టర్కీ’లో కాలినడకన ప్రయాణం చేస్తూ ఇరాన్ ఎడారుల గుండా అప్ఘనిస్తాన్, పాకిస్తాన్ జనావాసాల మధ్య అపరిచిత వ్యక్తుల ప్రేమ, ద్వేషాల మిశ్రమానుభూతితో చేతిలో పైసా లేకుండా పరమా త్మనే నమ్ముకుని చివరకు భారత దేశ సరిహద్దు చేరాడు. అక్కడ సరిహద్దు రక్షక దళ అధికారి ‘మా దేశంలో చాలామంది ముష్టివా ళ్లు ఉన్నారు..
జీవితంలో పెద్ద మలుపు...
హిమాలయాల్లోని గంగా ప్రవాహంలో ఆయనకు ‘హరే రామ హరే కృష్ణ’ మహామంత్రం వినిపించడం మరొక అద్భుతం. తరు వాత వృందావన యాత్ర రిచర్డ్ జీవితాన్ని నిజమయిన ‘రుషి’గా ఒక పెద్ద మలు పు తిప్పింది. కానీ బృందావ న యాత్ర తరు వాత శ్రీప్రభుపాదులవారు ‘రిచర్డ్’ కిగురువయ్యారు. తేలికగా ఎవ రినీ గురువుగా అంగీకరించని ఆ యన పట్టుదల యువతకు చక్కని హేతుబద్ధమైన మార్గదర్శనం చేస్తుంది. ఆ రిచర్డే ఇప్పుడు రాధా నాధ స్వా మిగా ఆంగ్లంలో ‘ ది జర్నీ హోమ్’ పేరుతో ఆత్మకథను రాశారు. ఇది ఒక ఆధ్యాత్మిక నవల. ఇందులో కష్టాలు, కన్నీళ్లు, ఆప్యాయతలు, ఆదరణలు వంటి హృదయోద్వేగాలు, వాటిని సరైన మార్గంలోకి మళ్లించే మంచి మనసులు అన్నీ ఉన్నాయి. ఆ త్మకథలు ప్రపంచ సాిహ త్యంలో ఎన్నో ఉన్నా ఇది నిజమైన ‘ఆత్మ’ కథ.
భక్తి విజ్ఞాన బోధన...
రాధానాధ్ స్వామి ౧౯౫౦ లో చికాగోలో జన్మించారు. యు క్త వయసులో తన ఆధ్మాత్మిక అన్వేషణలో భాగంగా ప్రపంచం అం తా సంచరించి చివరకు భక్తియోగ మార్గాన్ని అవలంభించారు. ప్రస్తుతం ఆయన ఆసియా, యూరప్, అమెరికాలలో పర్యటిస్తూ భక్తి విజ్ఞానాన్ని బోధిస్తున్నారు. కానీ తరచు ఆయనను ముంబా యిలో ఉన్న భక్త సమాజంలో చూడవచ్చు. రాధానాధ్ స్వామిని గురించి తెలిసిన వారు ఇతరులను భగవం తుని దరికి చేర్చడంలో ఆయనకు గల గొప్ప అంకితభావాన్ని కొనియాడుతారు. అదే స్థా యిలో ఆయన సరళత్వం, నిరాడంబరత్వం, హాస్యస్వభావం గురించి కూడా వివరిస్తారు. భక్త సమాజాల అభివృద్ధి, పేద విద్యార్ధులకు నిత్యాన్నదాన వితరణ, సమాజ సేవ లకు ఆసుపత్రులు, పర్యావరణ వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాల లు, ఆశ్రమాల స్థాపన వంటి కార్యక్ర మాలకు ఆయన ప్రోత్సాహం ఇచ్చి నడిపిస్తున్నారు.
| యుక్త వయస్సు లో శ్రీ రాదా నాద్ స్వామి అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో దొరికే ఈ పుస్తకం వెల ౧౫౦/- |
.
Friday, 26 August 2011
శ్రీ రామకృష్ణ కథామృతము.
ఒక పక్క బౌద్ధ మతం, జైన మతం మొదలైన మతాల ప్రభావం వల్ల, మరొక పక్క అంతరంగ విభేదాల వల్ల, హైందవ సాంప్రదాయం కకావికలమై ఉన్న తరుణంలో ఆదిశంకరుల ఆగమనం జరిగినట్టే, పాశ్చాత్య, ముగల్ సంస్కృతుల ధాటికి తట్టుకోలేక, గతంలో పరాయి ప్రభావాలని తనలో తీరుగా ఇముడ్చుకున్నట్టు ఈ కొత్త ప్రభావలని తనలో సమన్వయపరచుకోలేక భారతీయ సంస్కృతి సతమతమవుతున్న తరుణంలో, అనాది అయిన మన అధ్యాత్మిక సాంప్రదాయం సత్యమని, ప్రాచీనుల అధ్యాత్మిక అనుభూతులు నిజాలని, నిర్ధారించడానికి ఇద్దరు మహాపురుషులు 19 వ శతాబ్దపు నడిమి కాలంలో ఉదయించారు. వారు శ్రీరామకృష్ణులు, శ్రీ షిరిడీ సాయి బాబా.
వివిధ సాంప్రదాయాల నిర్ధారణభైరవి బ్రాహ్మణి అనే యోగిని ఆయనకి తంత్ర విద్య నేర్పింది. తంత్రవిద్యలోని సూక్ష్మాలన్నీ నేర్చుకుని, తంత్ర మార్గానికి పరాకాష్ట అయిన "శక్తి" లేక "దేవి" యొక్క సాక్షాక్తారాన్ని పొందారు శ్రీరామకృష్ణులు.తోతాపురి అనే అద్వైత వేదాంతి నుండి ఆత్మ విద్య నేర్చుకుని ఆ మార్గాంతంలో ఆత్మానుభూతిని పొందారు.కృష్ణుడి పట్ల గోపికలకి ఉండే మధుర భక్తిని అభ్యాసం చేత అనుభవించారు. భావాన్ని బలపరిచే బాహ్యసాధనంగా ఉంటుందని కాబోలు, ఆ దశలో ఆయన గోపికలకి మల్లె స్త్రీ దుస్తులని ధరించేవారని ఆయన జీవిత కథల నుండి తెలుస్తోంది.ఒక దశలో క్రైస్తవ సాంప్రదాయాన్ని కూడా కొంతకాలం అభ్యసించారు. తన భక్తుడైన శంభూ చరణ్ మల్లిక్ తనకి బైబిల్ చదివి వినిపించడంతో శ్రీ రామకృష్ణుల క్రైస్తవ సాంప్రదాయ నిబద్ధమైన జీవనం ఆరంభమయ్యింది. ఎన్నో రోజుల పాటూ క్రైస్తవ సాంప్రదాయానికి చెందిన ఆలోచనలతో ఆయన మానసం నిండిపోయింది. ఇక ఆ రోజుల్లో కాళీ ఆలయానికి వెళ్లడం మానుకున్నారు. ఒక రోజు ఆయన దృష్టి అలవోకగా బాల జీసస్ ని ఎత్తుకున్న మడోనా చిత్రం మీద పడింది. ఆ సమయంలో చిత్రంలోని మూర్తులు అదాటున ప్రాణం పోసుకున్నట్టు, జీసస్ తానే స్వయంగా తనలో ఐక్యం అయినట్టు ఆయనకి ఓ విచిత్రమైన అనుభవం కలిగింది.అలాగే ఇస్లాం తత్వాన్ని కూడా కొంత కాలం ఉపాసించారు. ఆ దశలో అల్లా నామాన్ని జపిస్తూ, అరబ్బుల దుస్తులని ధరిస్తూ, రోజూ ఐదు సార్లు నమాజ్ చేస్తూ గడిపేవారట. ఆ రోజుల్లో హిందూ దేవతల చిత్రాలని చూడడానికి కూడా ఇష్టపడేవారు కారట. ఆ విధంగా మూడు రోజుల ఉపాసన పూర్తి చెయ్యగానే ఆయనకి ఓ అనుభవం కలిగింది. "గంబీర వదనంతో, మెరిసే తెల్లని గడ్డంతో ప్రవక్తని పోలిన ఓ దివ్య పురుషుడు నాలో ఐక్యం చెందాడు" అని ఆయన చెప్పుకున్నారు.ఆ విధంగా ఓ శాస్త్రవేత్తలా, కఠోర నిష్ఠతో కూడా ప్రయోగాత్మక పద్ధతిలో ప్రతీ సాంప్రదాయాన్ని శోధించి, అందులోని మూల సత్యాన్ని నిర్ధారిస్తూ వచ్చారు.సహస్రాబ్దాలుగా భారతీయ అధ్యాత్మిక సంస్కృతి చాటిన ఓ ముఖ్య సందేశాన్ని - "మనిషి పుట్టుకకి లక్ష్యం దైవాన్ని తెలుసుకోవడమే" నన్న సందేశాన్ని - శ్రీ రామకృష్ణులు కూడా పదే పదే గుర్తుచేస్తారు. అయితే వ్యక్తిగతమైన అధ్యాత్మిక ఉన్నతి కోసం మాత్రమే ప్రాకులాడకుండా, తోటి మానవుల పట్ల సేవాధర్మాన్ని ("జీవే దయా నొయ్, శివ్ గ్యానే జీవ్ సేబా" - 'సాటి జీవుల పట్ల దయ చూబిస్తే సరిపోదు, జీవుడే శివుడు అన్న భావనతో సేవించాలి') కూడా గుర్తు చేస్తారు.ఆయన బోధలలోని ఈ 'మానవసేవ' అనే భావబీజాన్ని ఆయన ముఖ్యశిష్యుడు స్వామి వివేకానందుడు శ్రద్ధగా, అద్భుతంగా పోషించాడు. ఆ అంకురమే 'శ్రీరామకృష్ణా మిషన్' అనే మహా వృక్షంగా వర్ధిల్లింది. అంతవరకు ఏ కొద్ది మంది పండితులకో అందుబాటులో ఉండే విశాల భారతీయ అధ్యాత్మిక సాహిత్యం జనసామాన్యం అందుబాటులోకి వచ్చేట్టు చేసింది ఈ మిషన్.శ్రీ రామకృష్ణుల ఆగమనంతో భారత దేశ అధ్యాత్మిక పునరుద్ధరణ ఆరంభం అయ్యిందని చెప్పుకోవచ్చు.
భగవాన్ శ్రీరామకృష్ణులు ఈ అవతార పురుషుల మార్గంలో మనకు అతి సమీపకాలంలో అవతరించినవారు భగవాన్ శ్రీరమకృష్ణులు. శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు ప్రతి ఒక్కరూ ఆయన సందేశాలలో ఒక అంశాన్ని స్వీకరించి, దానిని తమ జీవితం ద్వారానూ,రచనలూ ప్రసంగాలు వివిధ మార్గాల వారానూ ప్రపంచానికి చాటారు. ఆ శిష్యులలో ఒకరు మహేంద్రనాధ గుప్త(‘మ‘). శ్రీ రామకృష్ణుల అమృతవాక్కులను ప్రపంచానికి అందజేసే మహద్భాగ్యం పొందిన వారు ఈయన.తద్వారా ప్రపంచ మత చరిత్రలో తరగని కీర్తినార్జించారు.శ్రీ రామకృష్ణుల అమృతవాక్కులు1882వ సం|| ఫిబ్రవరిలో "మ" శ్రీ రామకృష్ణులను ప్రప్రధమంగా సందర్శించారు. ఆనాటినుండి శ్రీ రామకృష్ణుల మహాసమాధి(1886)వరకు దాదాపు 250 రోజులు ఆయన్ను దర్శించి, వారి అమృతవాక్కులను ఆలకించే భాగ్యం పొందినవారాయన.ఆయన ఉపదేశాలను తమ డైరీలో రాసుకొని, పదిలపరిచారు. ఆ తరవాత వాటిని శ్రీ శ్రీ రామకృష్ణ కథామృత పేరిట ఐదు సంపుటాలుగా వంగ భాషలో ప్రచురించారు. దీని తెలుగుఅనువాదమే శ్రీ రామకృష్ణ కథామృతము.
అవతార పురుషులు తమ సందేశాలను మానవజాతి అంతటికి వ్యాప్తి చేయ సమర్ధులైన శిష్యులను తయారుచేసి, వదలి వెళుతున్నారు.వారి సందేశాల ప్రభావం, స్ఫూర్తి ఈశిష్యులద్వారా విద్య ,కళ ,విజ్ఞానం, మతం, ఆధ్యాత్మికత అనబడే సకల రంగాలకూ వ్యాప్తి గాంచుతుంది.వారి సందేశం ఒక నూతన శాస్త్రంగా రూపుదిద్దుకొంటుంది.అప్పటివరకు ఉంటూ వస్తున్న ఏ శాస్త్రాన్నిగాని అది నిందించటమో, విమర్శించటమో , తిరస్కరించటమో చేయదు; అందుకు మారుగా ఆ శాస్త్రం మునుపటి శాస్త్రాల అన్నింటి సంకలనంగా, పరిపూర్ణ రూపంగా పరిణమిస్తుంది. ఈ విధంగ వారి సాటిలేని జీవితం ద్వారానూ,వారు వదలి వెళ్ళే సందేశాల ద్వారానూ మానవజాతికి ఒక నూతన మార్గం,కాలానుగుణమైన ఒక వెలుగుబాట ఆవిష్కృతమౌతుంది.
రామకృష్ణ కదామృతము చదువుతూవుంటే ఆ అధ్బుత దృశ్యాలు మనం చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
Thursday, 25 August 2011
ఒక యోగి ఆత్మ కధ
ఆధునిక ఆధ్యాత్మిక భక్తి పుస్తకాల లో పరిచయం అవసరం లేని పుస్తకరాజం "ఒక యోగి ఆత్మకధ" .చాలా మంది ప్రముఖుల జీవిత చరిత్రలలో ఈ పుస్తక విషయం కనిపిస్తుంది. అంతే కాక చాలా జీవితాలను ప్రభావితం చేసిన ఒక గొప్ప పుస్తకం "ఒక యోగి ఆత్మకధ" . ఈ పుస్తకం ౨౬ భాషల లోకి అనువదించబడింది. ఈ పుస్తకానికి వెనుక భాగం లో ఉన్న పరిచయ వాక్యాలను యధాతధంగా ఇక్కడ పొందు పరచడమైనది.
ఈ ఆత్మకధ ఏక కాలం లో ఒక పరిశీలన, ఒక పద చిత్రణ. మానవ అస్తిత్వపు అంతిమ మర్మాలను మరిచిపోలేని రీతిలో నిశితంగా పరిశిలించే బహుళాదరణ పొందిన ఈ ఆత్మకధ, మన కాలపు ఆధ్యాత్మిక మహాపురుషులలో ఒకరి ఆకర్షణీయమైన వ్యక్తిత్వ చిత్రీకరణ కూడా. పరమహంస యోగానంద గారు ఆకట్టుకొనే నిజాయితీ తోనూ, ధారాళమైన వాక్పటిమతోనూ, హాస్యయుతంగానూ , ఉత్తేజకరమైన తమ జీవిత కధను చెబుతారు.అద్భుతమైన ఆయన బాల్యానుభవాలు, జ్ఞాని అయిన ఒక గురువుకోసం యవ్వనంలో ఆయన చేసిన అన్వేషణలో తారసపడిన అనేకమంది సాదుసంతులతో అనుధవాలు, దైవ సాక్షాత్కారం పొందిన గురుదేవుల ఆశ్రమంలో పది సంవత్సరాలు సాగిన శిక్షణా , ప్రపంచ వ్యాప్తంగా సత్యాన్వేషకులకు భోధ చేస్తూ గురువుగా ఆయన గడిపిన అనేక సంవత్సరాల కాలం అన్నీ ఇందులో వివరించారు.రమణ మహర్షి,ఆనందమయి మాత, మాస్టర్ మహాశయులు, మహాత్మా గాంధి,రవీంద్రనాథ్ టాగూర్,జగదీశ్ చంద్ర బోస్,లతో ఆయన సమాగమ వివరాలు కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి.
ఆధునిక ఆధ్యాత్మిక గ్రంధరాజం గా ప్రశంసలు పొందిన ఈ పుస్తకం ౨౬ భాషలలోకి అనువదించబడింది.అనేక కళాశాలల్లో విశ్వవిద్యాలయాలలో పాఠ్యగ్రంధం గా విస్తృతంగా దీన్నిఉపయోగిస్తున్నారు. ఒక జీవిత కాలపు మనోహరమైన గ్రంథముగా ఒక యోగి ఆత్మకధ ను వేలాది మంది పేర్కొన్నారు.
సాధారణమైన ఆత్మకథ అక్షరాలతో తయారవుతుంది. కాని యోగులు మహర్షుల ఆత్మకధలు అనుభవాలతో కూడిన అక్షర సత్యాలు కావున వాటిని చదివిన వారికి ఎంతో మేలు చేయటమే కాకుండా మార్గదర్సకాలవుతాయి.
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో దొరికే ఈ అద్భుతమైన పుస్తకం వెల ౧౦౦ రూ.
Wednesday, 24 August 2011
భక్తిపుస్తకం
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు,పుస్తకాలు మానసికవికాసాన్ని కలిగిస్తాయి కానీ భక్తి,జ్ఞానములను ప్రసాదించే పుస్తకరత్నాలు అరుదు కదా అటువంటి పుస్తకాలు అదృష్టం ఉంటే గానీ దొరకవు అంటారు.అటువంటి పుస్తకప్రియులదే ఈ భక్తిపుస్తకం సైట్.
Subscribe to:
Posts (Atom)


